నిర్ణీత గడువులోపే సమస్యకు పరిష్కారం – ఆర్డీవో
1 min read

వ్యయ ప్రయాసాలు పడి జిల్లా కేంద్రానికి వెళ్లొద్దు
భూ సమస్యలను పరిష్కరించేందుకు మేమున్నాం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కేంద్రానికి ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు అక్కడికి వెళుతూ ఉన్నారని అలా వెళ్లకుండా మా దగ్గరికి వస్తే మేమే పరిష్కరిస్తామని ఆత్మకూరు ఆర్డీవో డి నాగజ్యోతి అన్నారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆర్డిఓ పాత్రికేయులతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ లో ఉన్న మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందని వీటిలో తహసిల్దార్ మరియు మండల అధికారులు పాల్గొంటున్నారు.మీకు సంబంధించిన పొలాల సమస్యలు ఏమైనా ఉంటే ప్రతి సోమవారం ఉ 10 గంటల నుండి మ 2 గంటల వరకు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కు అర్జీల రూపంలో ఇవ్వాలని నిర్ణీత గడువులోపే మీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో అన్నారు.తహసిల్దార్ దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మకూరు ఆర్డీవో దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రానికి వెళ్లవచ్చని అన్నారు.డివిజన్ లో ఉన్న ప్రజలు మీ మండల తహసిల్దార్ దగ్గరికి వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఈ అవకాశాన్ని వివిధ మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో నాగజ్యోతి అన్నారు.

