NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం

1 min read

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్

కర్నూలు, న్యూస్ ​నేడు:  కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వేగవంతమైన, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు  టి.జి. భరత్ స్పష్టం చేశారు. ఈ  దేవదాయ శాఖ పరిపాలన భవన సముదాయం నిర్మాణానికి సుమారు రూ.5 కోట్ల నిధులు కేటాయించి పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం పునాది వేసి పిల్లర్ స్థాయిలోనే నిలిచిపోయిన నిర్మాణాలను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేసి పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనం రామ నారాయణరెడ్డి గారు పరిపాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని , అన్ని శాఖలపై అవగాహనతో వ్యవహరించే వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి టి.జి. భరత్ ప్రశంసించారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకత్వంలోనే సాధ్యమవుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, దూప నైవేద్య దేవాలయాలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహార్ లాల్ , కమిషనర్ రామచంద్ర మోహన్ , రీజనల్  జాయింట్ కమిషనర్ ఆజాద్ , డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ , సూపరిండెంట్ ఇంజనీర్ సతీష్ , అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్ది , మద్దిలేటి స్వామి ఈవో రామాంజనేయులు , మహానంది , ఉరుకుందు ఈరన్న మొదలగు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు , ఇంజనీర్లు సిబ్బంది హాజరయ్యారు.

About Author