మోటార్ సైకిల్ కు నిప్పు…
1 min read
మహానంది, న్యూస్ నేడు: మండలంలోని గోపవరం గ్రామంలో మోటార్ సైకిల్ కు నిప్పు పెట్టినట్లు బాధితుడు గుర్రం మల్లికార్జున పేర్కొన్నారు. ఎస్సీ కాలనీలోని తన ఇంటి ముందు ఉంచిన మోటర్ సైకిల్ ను శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ కు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో తాము ఇంట్లో నిద్రిస్తున్నామని కాలిన వాసన మంటలతో కూడిన శబ్దం రావడంతో బయటికి వచ్చి చూసేసరికి మోటార్ సైకిల్ కు మంటలు వ్యాపించినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో తరచూ ఏవో ఒకటి సంఘటనలు చోటు చేసుకోవడం తో పోలీసులకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది.


