NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి

1 min read

మహా రథోత్సవానికి పూజలు

మంత్రాలయం , న్యూస్​ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354 వ సప్త ఆరాధనోత్సవాలలో భాగంగా టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి రాఘవేంద్ర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ముందు గా గ్రామదేవత మంచలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు తో కలిసి మహా రథోత్సవం కు గుమ్మడికాయ కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి వ్యాసరాజ్ చార్, గోపాల్ కృష్ణ స్వామి, మంత్రాలయం నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, వట్టేప్ప నర్సింహులు, నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

About Author