ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైపు ప్రజా ప్రభంజనం
1 min read
వైకుంఠం జ్యోతి సమక్షంలో టీడీపీలో చేరిన సులువాయి గ్రామ వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, 50 కుటుంబాలు
చంద్రబాబు నాయకత్వం – వైకుంఠం
జ్యోతి సేవలకు ఆకర్షితులై భారీగా టీడీపీలో చేరికలు
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో హోళగుంద మండలంలోని సులువాయి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు మరియు దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఘనంగా చేరారు.ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి సారథ్యంలో, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి వైకుంఠం జ్యోతి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వమే సరైన మార్గమని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అభివృద్ధి లోపం కారణంగా ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రజా సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. సులువాయి గ్రామ ప్రజలు టీడీపీలో చేరడం ఆలూరు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామమని, రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవం, అభివృద్ధి దృక్పథం, అలాగే ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠం జ్యోతి ప్రజాసేవా కార్యక్రమాలు తమను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. గ్రామ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు మద్దతు, మహిళలకు భద్రత కల్పించగల శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందని విశ్వసించి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


