రైల్వే ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : పాటియాలా రైల్ ఇంజిన్ ఫ్యాక్టరీ 295 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ plw.indianrailways.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 నవంబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. విభాగాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ విభాగంలో 140 పోస్టులు, మెకానిక్ (డీజిల్) విభాగంలో 15 పోస్టులు, మెకానిస్ట్ విభాగంలో 15 పోస్టులు, ఫిట్టర్ విభాగంలో 75 పోస్టులు, వెల్డర్ (G&E) విభాగంలో 25 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే.. జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 నుంచి రూ.8,050 వరకు స్టైఫండ్‌ను అందజేస్తారు. దరఖాస్తు రుసుము విషయానికొస్తే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.