ఆర్ఆర్ఆర్ కు ప్రపంచ వ్యాప్త క్రేజ్ రావడానికి కారణం చెప్పిన రాజమౌళి
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో కూడా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చిన గొప్ప స్పందన గురించి గురించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నిర్దయతో కూడిన హీరోయిజం, భారీ యాక్షన్ సన్నివేశాల వల్లే ఈ చిత్రం అన్ని హద్దులూ చెరిపేసి ప్రపంచాన్ని మెప్పించగలిగిందని చెప్పారు. విదేశీ అభిమానుల నుంచి ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చిన విపరీతమైన స్పందన తనను ఆశ్చర్యపరిచిందని రాజమౌళి అన్నారు. హీరోయిజం వల్లే ఈ చిత్రం అడ్డంకులను అధిగమించగలిగిందన్నారు. అలాగే, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి సహాయపడ్డాయని ఆయన చెప్పారు.