NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆప్టా జిల్లా ప్రధాన కార్యదర్శి గా దాసరి గోపాల్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నేడు సాయంత్రం కర్నూలు జిల్లా ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) కార్యాలయం లో కర్నూలు జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశం యందు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు హాజరు కావడం జరిగింది. ప్రకాష్ రావు మాట్లాడుతూ గుర్తింపు పొందిన ఉపాద్యాయ సంఘములో ఇతర డిపార్ట్మెంట్ లో వెళ్ళిన వారు ఉండకూడదు కాబట్టి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్న సేవా లాల్ నాయక్ డిప్యుటేషన్ పై వయోజన విద్యా శాఖ లో వెళ్ళినందున ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సభ్యత్వం నకు రాజీనామా చేయడం జరిగింది. ఇంత వరకు ఎంతో కస్టపడి సంఘము కొరకు పని చేసిన సేవా లాల్ నాయక్ కు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. సేవా లాల్ నాయక్ స్థానం లోరాష్ట్ర నాయకత్వం ఈ జిల్లా కు కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవలసినదిగా నిర్ణయం తీసుకోవటం తో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పారు.కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి  వసంత నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా పని చేయుచున్న దాసరి గోపాల్ యొక్క పేరును నామినేట్ చేయడం తో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. జూన్ నెల లో జరిగే సాధారణ ఎన్నికల వరకు డి గోపాల్  వ్యవహరిస్తారు .ఈ సమావేశం యందు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్,మాజీ ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్, నాగార్జున, రాజేష్, లక్ష్మన్న, సుధా రాణి, లత మొదలైన నాయకులు పాల్గొనటం జరిగింది.

About Author