జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోటీల విజేతలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో సందర్భంగా స్థానిక బి క్యాంపు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకుగ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు.గురువారం ఈ క్యాంపు గ్రంథాలయ శాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారా ప్రజలకు సమాజంలో ఎంతోఉపయోగకరంగా ఉంటాయన్నారు.నగరంలోని ప్రజలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం విజేతలకు పాఠశాలలో ఉపాధ్యాయులు హరిశంకర్,విజయకుమార్, జగన్మోహన్ ఆచారి,రామలక్ష్మి, అరుణశ్రీ,జయ కుమార్ తదితరులువిజేతలకు జ్ఞాపికలను అందజేశారు.వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలు వీరే….భారతదేశ స్వాతంత్ర సాధనలో గ్రంథాలయాల పాత్ర అంశంలో నిర్వహించిన పోటీలో బి క్యాంపు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎం రవితేజ,బి హేమంత్ కుమార్,వినయ్ కుమారులు బహుమతులు సాధించగా,బాలికల పాఠశాలలో ప్రవల్లికఅక్షయ రాణివిజేతులుగా నిలువగా,చిత్ర లేఖనం పోటీలలో బాలుర పాఠశాలచెందిన సతీష్,మహమ్మద్రసూల్,కేశన్నలు విజేతలు కాగా,వ్యక్తిత్వ పోటీలలో బి క్యాంపు జూనియర్ కళాశాలకు చెందిన ఇందు శ్రీ వర్షిని ఆనంది,ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ఏస్వర్ధన్ మదన్ కుమార్ ఉషా బాయిలు విజేతలుగా నిలిచి అందుకున్నారు.అనంతరం పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి శంకర్ విజేతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చౌడయ్య,రమణయ్య,హరి శంకర్,ఎన్సిసి అధికారి విజయకుమార్, ప్రకాష్,ప్ఫిజికల్ డైరెక్టర్లు విజయకుమార్ ,జగన్మోహన్ ఆచారితదితరులు పాల్గొన్నారు.

