NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంట ఖర్చులు తగ్గించి..ఆదాయం పెంచండి

1 min read

వ్యవసాయ అధికారులకు శిక్షణ

జిల్లా వ్యవసాయ అధికారి మదిలేటి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రైతులు వేసే పంటల ఖర్చులు తగ్గించి పంటల ఆదాయం ఏ విధంగా పెంపొందించుకోవాలనే వాటి గురించి మరియు ప్రకృతి వ్యవసాయంపై నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎంసీ మద్దిలేటి వ్యవసాయ అధికారులకు శిక్షణ ఇచ్చారు. నందికొట్కూరు పట్టణంలోని ఆత్మ భవనంలో నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం గిరీష్ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు.సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతింటోందని,భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆహారం అందించాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

(ప్రీ-మన్సూన్ డ్రై సోయింగ్)

పీఎండిఎస్ అనే వినూత్న పద్ధతిని అభివృద్ధి గురించి పీఎండిఎస్ అంటే తొలకరి చినుకులకు ముందుగానే 20 నుండి 30 రకాల విత్తనాలను (చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పప్పుదినుసులు,నూనె గింజలు,పచ్చిరొట్టె ఎరువులు, మసాలా దినుసులు, ఆకుకూరలు,కూరగాయల విత్తనాలు)ఆ విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చేసి,పొలంలో విత్తుకొని ఆచ్చాదనతో భూమిని కప్పి ఉంచాలని ఇలా చేయడం వల్ల విత్తనాలు సజీవంగా ఉండి, 10 ఎంఎం వర్షపాతం పడిన వెంటనే మొలిచే అవకాశం ఉంటుందని ఇది భూమిని సజీవంగా ఉంచి,సూక్ష్మజీవుల వృద్ధికి తోడ్పడడమే కాకుండా కలుపును మరియు పురుగు/ తెగుళ్ళను నివారిస్తుంది.

అలాగే ఏ గ్రేడ్,ఏటీఎం మోడల్స్

ప్రకృతి వ్యవసాయంలో 9 సార్వత్రిక సూత్రాలు గురించి వివరించారు.రైతులకు ప్రధాన పంటలతో పాటు పలు పంటలు సాగు వంటి సాంకేతికతలను తెలియజేసి రైతులకు ఖర్చులు తగ్గించి ఆదాయాలు పెంచే మార్గాలను రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు.ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు షేక్షావలి,ఎం.పీరు నాయక్,కృష్ణారెడ్డి,మురళీ మరియు రైతు సేవా కేంద్రం విఏఏ,విహెచ్ఏ,ప్రకృతి వ్యవసాయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author