ఆలూరులో ఈనెల 28 నుండి ధార్మిక కార్యక్రమాలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్తిక మాసం సందర్భంగా ఈ నెల 28వ తేదీ మంగళవారం నుండి 31వ తేదీ శుక్రవారం వరకు ఆలూరు పట్టణములో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరము నందు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీమాన్ కీర్తిరాజదాస్ స్వామి చే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివానుగ్రహానికి పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక షిరిడీ సాయిబాబా సేవా భక్తబృందం ఆవిష్కరించారు.

