కర్నూలు జీజీహెచ్ వైద్యశాలకు వీల్ చైర్ … ఎయిర్ బెడ్ విరాళం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ అండ్ సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ :- కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎం. రమేశ్ తల్లి అయిన రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి జ్ఞాపకార్థంగా ఆసుపత్రికి వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళంగా అందజేశారు.సామాజిక సేవా దృక్పథంతో ఆసుపత్రికి ఈ పరికరాలు అందజేయడం పట్ల మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు.ఈ విరాళంగా అందిన పరికరాలను ఎమర్జెన్సీ విభాగాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటరమణ, రమేశ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

