సచివాలయాల అకస్మిక తనిఖీ..
1 min read

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం
నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరంలోని కల్లూరు ప్రాంతంలోని 84, 85వ వార్డు సచివాలయాలను గురువారం నగరపాలక సంస్థ మేనేజర్ యన్. చిన్నరాముడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ముందుగా సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. సమయపాలన, సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం, సిబ్బంది తమ విధుల నిమిత్తం బయటకు వెళ్లిన వివరాలను నమోదు చేసే మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. రిజిస్టర్లో వివరాలు స్పష్టంగా, సరిగ్గా నమోదు చేశారో లేదో తనిఖీ చేశారు. ముఖ్యంగా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, సేవల్లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందేలా సచివాలయ సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు.

