NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హళగుంద-4లో కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులపై అవగాహన గ్రామసభ

1 min read

ఖరీఫ్ సీజన్‌కు ముందే కౌలు రైతు కార్డు నమోదు తప్పనిసరి

రాయితీలు, పంట భీమా, నష్టపరిహారం కోసం సీసీఆర్సీ కార్డు కీలకం

భూమిలేని SC, ST, మైనార్టీ రైతులకు అన్నదాత సుఖీభవ అవకాశం

11 నెలల గడువుతో సీసీఆర్సీ కార్డు – రిన్యువల్ తప్పనిసరి

 రైతు సేవా కేంద్రాల ద్వారా సులభంగా నమోదు ప్రక్రియ

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని హళగుంద-4 రైతు సేవా కేంద్రం  పరిధిలోని రైతులకు సీసీఆర్సీ (Crop Cultivator Rights Cards) – కౌలు రైతు గుర్తింపు కార్డులపై మండల వ్యవసాయ అధికారి శ్రీ ఆనంద్ లోకదళ్ వారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించబడింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో పొలాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా కౌలు రైతు కార్డు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధర, పంట భీమా, నష్టపరిహారం వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.భూమిలేని ఎసీ, ఎస్టీ, మైనార్టీ రైతులు సీసీఆర్సీ కార్డు పొందితే అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హత ఉంటుందని వివరించారు. అలాగే అకాల వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నష్టపోతే కౌలు రైతులకు నష్టపరిహారం అందుతుందని చెప్పారు. సీసీఆర్సీ కార్డు 11 నెలల కాలపరిమితి కలిగి ఉండి, అనంతరం పునరుద్ధరణ (Renewal) చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్డు పొందేందుకు భూ యజమాని ఒప్పంద పత్రం, పొలానికి సంబంధించిన సర్వే నంబర్, మొబైల్ నంబర్‌తో సమీప రైతు సేవా కేంద్రం లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ విరూపాక్షి,   ఆర్​ఎస్​కే సిబ్బంది శివకృష్ణ, రాజు నాయిక్, రమేష్ మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

About Author