అనంతపురం జర్నలిస్టుపై దాడి ఘటనపై ఎస్డీపిఐ ఆగ్రహం
1 min read
గీతం కాలేజీ కరస్పాండెంట్ మనీషా నాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నిజం వెలుగులోకి తెచ్చే వారిపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన
జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఎస్డీపిఐ పిలుపు
హోళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలం, ఆలూరు తాలూకా, కర్నూలు జిల్లాఅనంతపురం జిల్లాలో జర్నలిస్టుపై జరిగిన దాడి ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఎస్డీపిఐ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండల పార్టీ కార్యాలయంలో ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన విలేఖర్ల సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ, అనంతపురం జిల్లాకు చెందిన పత్రిక విలేఖరి లక్ష్మీనారాయణ గీతం కాలేజీకి సంబంధించిన విషయాలను పత్రికలో ప్రచురించగా, గీతం కాలేజీ కరస్పాండెంట్ మనీషా నాయర్ కొంతమంది వ్యక్తులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడటం, దాడి చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు.అంతేకాకుండా, ఇటీవలి కాలంలో నిజాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు, సోషల్ మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య కూడా ఇటువంటి ఘటనలకు ఉదాహరణగా పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, ఎస్డీపిఐ పార్టీ తరఫున మనీషా నాయర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు త్వరితగతిన విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కే. సలాం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి హఫీజ్, కోశాధికారి అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు.

