వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం నూతన డైరీ ఆవిష్కరణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి జవహర్లాల్ చేత ఆవిష్కరణ కార్యక్రమం చేయించడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, మరియు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆర్ వి రమణ, నగర అసోసియేట్ అద్యక్షులు వెంకటేశ్వర్లు, మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కారం దిశగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కృషి చేయగలరని జిల్లా అధ్యక్షులు వీ జవహర్లాల్ తెలియజేయడం జరిగినది.

