సుప్రీంకోర్టులోని కేసుల పరిష్కారా నికి ప్రత్యేక లోక్ అదాలత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ” సమాధాన్ సమరోహ్ – సుప్రీంకోర్టులో గల కేసుల పరిష్కారా నికి ప్రత్యేక లోక్ అదాలత్ ” సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీ చేసుకోదగిన కేసుల పరిష్కారం నిమిత్తం సుప్రీంకోర్టు స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆగస్టు 21,22, 23 తేదీలలో నిర్వహించనున్నారని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు . ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీ చేసుకోదగిన కేసుల ఇరువర్గాలు తమ వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ముందస్తు స్క్రీనింగ్ కార్యక్రమాలను ఈనెల 16-06-2026 నుండి 30-06-2026 వరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ న్యాయ సేవ సదన్ కర్నూలు నందు నిర్వహిస్తామని కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు.అలాగే ఈ రోజు 16-07-2026 జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి నిర్వహించిన ఫ్రీ స్పెషల్ లోక్ అదాలత్ స్క్రీనింగ్ నందు 2014 సంవత్సరం సుప్రీంకోర్టు కేసును ఇరుపక్షాలు వారి న్యాయవాదులు పరిష్కారానికి అంగీకరించారు. సుప్రీంకోర్టు నందు పెండింగ్ ఉన్న కేసులలో నోటీసులు అందుకున్న కక్షి దారులు వారి న్యాయవాదులు డిస్టిక్ కోర్టు వెబ్సైట్ www.ecourtskurnool.com & kurnool.dcourts. gov.in నందు పొందుపరిచిన తేదీలలో వర్చువల్ విధానంలో గాని లేదా ప్రత్యక్షంగా గాని జిల్లా న్యాయ సేవా సదన్ నందు హాజరై తమ కేసులను స్నేహపూర్వకంగా మరియు ఖర్చు లేకుండా పరిష్కరించుకోవాలని తెలిపారు. కక్షిదారులు తమ చెక్ బౌన్స్ కేసులు, ప్రమాదాలకు సంబంధించిన క్లైములు, భూ సేకరణ సమస్యలు, తదితర కేసులను ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 15100, 08518-248828కు ఫోన్ చేయాలని కోరారు.

