NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

18న పారిశుద్ధ్య కార్మికులతో ‘యోగాంధ్ర’

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు, న్యూస్​ నేడు:  మంగళవారం ఈ నెల 18న ఎస్‌ఏపి క్యాంపు వద్ద నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు యోగాంధ్ర కార్యక్రమం జరుపనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం ఆయన ఎస్‌ఏపి క్యాంపులో ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరిశీలించారు. ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారని పేర్కొన్నారు.  అదేవిధంగా కప్పల్ నగర్, అశోక్ నగర్, వై.జంక్షన్, వీకర్ సెక్షన్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డియస్‌పి మాహబూబ్ బాష, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం‌.రఘు, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ గిరిరాజ్, డిఈఈ శ్రీనివాసన్, ఏఈ వైష్ణవి, ఖాసిం, శానిటేషన్ సూపర్వైజర్ రమేష్, ఇంస్పెక్టర్లు ఆలీం బాష, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *