మంత్రి నారా లోకేష్ ఆలోచనా విధానంతో ప్రభుత్వ స్కూల్స్‌లో మంచి ఫలితాలు
1 min read
ప్రభుత్వ స్కూల్ టెన్త్ విద్యార్థులతో మంత్రి టీజీ భరత్ లంచ్ మీట్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంట్లో ప్రత్యేక విందు ఇచ్చారు. విద్యార్థులకు ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించి విద్యార్థులతో కలిసి లంచ్ చేశారు. విద్యార్థులను అభినందించి, నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు. భవిష్యత్తులో చదివే ఉన్నత చదువుల్లో కూడా ఇలాగే మంచి మార్కులతో రాణించాలని మంత్రి టీజీ భరత్ వారితో చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా ప్రభుత్వ స్కూల్‌ను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన కృషి వల్లే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో మంచిగా రాణించినట్లు చెప్పారు. విద్యార్థులు సైతం మంత్రి లోకేష్ ఆలోచనా విధానం తమకు ఎంతో ఉపయోగపడిందని చెప్పినట్లు టీజీ భరత్ చెప్పారు. ఈ లంచ్ మీట్‌లో డాక్టర్ ఏ.పి.జే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులు పిక్కిలి లిఖిత-593, పింజరి గిరీష-591, మీసాల మేఘన-587, కురువ మల్లికార్జున-581 మార్కులు, సీ.క్యాంపు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి గాజుల రోహిత-582 పాల్గొన్నారు. మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా ఇంటికి పిలిచి అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ లంచ్ మీట్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


