విద్యార్థులు విద్యతో ప్రయోజకులవ్వాలి
1 min read

విజ్ఞాన్’లో తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే
నందికొట్కూరు, న్యూస్ నేడు: విద్యార్థులు చక్కగా చదువుకొని కళాశాలలో లెక్చరర్లు చెప్పే వాటిని శ్రద్ధగా విని ప్రయోజకులు అవ్వాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య విద్యార్థులకు సూచించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనివిజ్ఞాన్ జూనియర్ కళాశాలలో సోమవారం మ 12 గంటలకు వేదాంతు ఆన్ లైన్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కళాశాల కరస్పాండెంట్ గాంధీ నాయుడు,ప్రిన్సిపాల్ ప్రసాద్ పూల బోకేలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కడియం వెంకటేశ్వర్లు యాదవ్,భాస్కర్ రెడ్డి,లాయర్ జాకీర్, వేణుగోపాల్,సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి,సుబ్రహ్మణ్యం మరియు కళాశాల అధ్యాపకులు వినోద్,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


