పదోన్నతి..త్యాగరాజుకు ఘన సత్కారం
1 min read

పదోన్నతి పొందినందుకు గాను’మాల మహానాడు’ సన్మానం..
నందికొట్కూరు , న్యూస్ నేడు: ఉద్యోగ స్థానంలో అంచె లంచలుగా ఎదుగుతూ పదోన్నతి పొందిన సగినేల త్యాగరాజును మాల మహానాడు నాయకులు ఘనంగా సత్కరించారు.మాల జాతి ముద్దుబిడ్డ సగినేల త్యాగరాజు నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో జన్మించి అక్కడే ప్రాథమిక విద్య, నందికొట్కూరులో మాధ్యమిక విద్యను అభ్యసించాడని మాల మహానాడు తాలూకా అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ అన్నారు.విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ నుండిజూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా పదోన్నతి పొంది ఆళ్లగడ్డలో విధుల్లో చేరారు.ఈ ప్రమోషన్ పొందడం మాల జాతికే గర్వకారం ఇంతటి అత్యున్నతమైన పదవిని అధిరోహించిన త్యాగరాజును మాల మహానాడు నాయకులు కమిటీ సభ్యులు పూలమాలతో సన్మానించి అభినందలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెరుమాళ్ళ మధు,బండారు శ్రీను,చరణ్ తేజ,యేసు రత్నం,భాస్కర్, ఏసురత్నం చెరుకు నడిపెన్న , శెట్టి శేఖర్,దండు సునీల్ తదితరులు పాల్గొన్నారు.


