NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజినవేముల’లో ఘనంగా రథోత్సవం

1 min read

పొట్టేళ్ల పందాలు నిర్వహణ నగదు అందజేత..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో శ్రీ కాశీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.వివిధ గ్రామాల ప్రజలు,భక్తాదులు, బంధువులు ఉదయం నుండి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు నడుమ రథోత్సవ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం ఉదయం తిరుణాల సందర్భంగా గ్రామ సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో పొట్టేళ్ల పందాలను నిర్వహించారు.

గెలుపొందిన పొట్టేళ్ల పందాల వివరాలు: తిరుణాల సందర్భంగా గ్రామంలో జరిగిన పొట్టేళ్ల పందాల్లో గెలుపొందిన వివరాలు:మొదటి బహుమతిగా నంద్యాలకు చెందిన ఆంధ్ర కట్ల రాక్షసి 10 వేలు,రెండవది పగిడ్యాల మహేష్-8వేలు,3 గణేష్-6 వేలు,4 ప్రాతకోట రమేష్ 4 వేలు,5 గడివేముల రంగస్వామి-2 వేల రూపాయల నగదును సర్పంచ్ రవి యాదవ్ అందజేశారు.మంగళవారం రాత్రి జానపద గేయ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.అదేవిధంగా ఈరోజు బుధవారం రాత్రి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

About Author