NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన

1 min read

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల కృషి ఎంతో కీలకం

జర్నలిస్టుల సంక్షేమానికి తాము ఎప్పుడూ అండగా ఉంటాం

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల కృషికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చంటిని,దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF) సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 23వ తేదీన జరగనున్న జర్నలిస్టుల కార్తీక వన సమారాధన మహోత్సవ పోస్టర్ను దెందులూరు ఎమ్మెల్యే, ఏలూరు ఎమ్మెల్యే ల చేతుల మీదుగా ఆవిష్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “విలువలతో కూడిన జర్నలిజం ద్వారానే సమాజానికి మరింత మేలు జరుగుతుందని, కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల, అసత్య కథనాల వల్ల మీడియా పట్ల సమాజంలో నానాటికి దిగజారిపోతున్న గౌరవాన్ని తిరిగి నిలబెట్టి, ప్రజల్లో అభిమానాన్ని, నమ్మకాన్ని చూరగొనెల జర్నలిస్టులు కృషి చేయాలని, నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తూ,  ప్రజలకు సమాచారం అందించటం కోసం తాపత్రయ పడుతూ ఎంతో మంది జర్నలిస్టులు తమ జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారని, చేస్తున్నారని, అటువంటి ప్రతి జర్నలిస్టు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు. నిరంతరం పని ఒత్తిడిలో జీవించే జర్నలిస్టులకు ఈ విధంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం వల్ల వాళ్లకి కొంత ఆహ్లాదకరమైన వాతావరణం లభించేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(APWJF) ఏలూరు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జబీర్,వై.వి హరీష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు సోమశేఖర్,యర్రా జయదాస్,మండల నాయకులు వెంకట్రావు,పగడం.కళ్యాణ్, సత్యనారాయణ,పి.మిల్టన్,సి.పి శ్రీనివాస్,నాగేశ్వరరావు, దొరబాబు,సన్నీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Author