అనాధ వృద్ధుల కు స్వామి వివేకానంద ట్రస్ట్, భారత్ యూత్ అసోసియేషన్ అండ
1 min read
58వ నెలలోనూ నిరంతర సేవా కార్యక్రమాలు
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. ప్రతి నెలా సేవా కార్యక్రమాలు కొనసాగింపు
హొళగుంద న్యూస్ నేడు: పేదలు, అనాథ వృద్ధులు, వికలాంగులకు అండగా నిలుస్తూ స్వామి వివేకానంద ట్రస్ట్ ఆదోని, భారత్ యూత్ అసోసియేషన్ హొళగుంద వారి ఆధ్వర్యంలో 58వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన హోటల్ ఈరన్న, ఎర్రమ్మ దంపతులకు, మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మకు, అలాగే గ్రామానికి సేవలందిస్తున్న గుర్కా నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు.అలాగే హొళగుంద పరిసర గ్రామాల్లో అర్హులైన నిరుపేదలు, అనాథ వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి నెలా దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ మానవతా విలువలను చాటుతున్నారు.సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనివ్వడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. దాతలు, సహృదయులు అందించే సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని తెలిపారు.58 నెలలుగా నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు కృషి చేస్తున్న స్వామి వివేకానంద ట్రస్ట్ ఆదోని, భారత్ యూత్ అసోసియేషన్ హొళగుంద సేవలను పలువురు అభినందిస్తున్నారు.



