NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుంతకల్లులో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన ఆలూరు ఎమ్మెల్యే !

1 min read

భక్తిశ్రద్ధలతో మండల దీక్ష స్వీకరణ.. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యేతో పాటు మాలధారణ చేసిన సోదరుడు బుసినే శ్రీరాములు, వైఎస్సార్సీపీ నాయకులు

ఆలూరు న్యూస్ నేడు: అనంతపురం జిల్లాగుంతకల్లు పట్టణంలో ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అయ్యప్ప స్వామి మాలధారణ చేసి మండల దీక్షను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అయ్యప్ప స్వామి నామస్మరణతో మాలధారణ కార్యక్రమం జరిగింది.అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.అయ్యప్ప స్వామిపై భక్తి, విశ్వాసంతో మండల దీక్షను స్వీకరించిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షితో పాటు ఆయన సోదరుడు బుసినే శ్రీరాములు కూడా అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *