NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జోహారాపురం లో సయ్యద్ అల్లాబకష్ వలి ఉరుసు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   కర్నూలు నగరం లోని జోహారాపురం లో ఈ నెల 03-10-2025 శుక్రవారం  గంధము,04-10-2025 శనివారం ఉరుసు (తట్టీలు ), 05-10-2025 ఆదివారం కిస్తీలు (జియారత్ )ఉరుసు మహోత్సవం జరుగుతుందని దర్గా ముత్తవలి(నిర్వాహకులు )సయ్యద్ అల్లాఉద్దీన్ షరీఫ్ పాషా తెలిపారు.ఈ సందర్బంగా నిర్వాహకులు సయ్యద్ అల్లా ఉద్దీన్ షరీఫ్ పాషా మాట్లాడుతూ జోహారాపురము గ్రామం లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి మతసామరస్యానికి ప్రతీకగా 3 రోజులు జరుపు కుంటారని, ఈ ఉరుసు కు జిల్లా నలుమూలలనుండి హాజరు అవుతారని చెప్పారు. గత 372 సంవత్సరాల నుండి ఈ ఉరుసు మహోత్సవం జరుగుతుందని, కావున భక్తులందరు ఉరుసు మహోత్సవం నకు హాజరై సయ్యద్ అల్లాబకష్ వలి  దయకు పాత్రులై, ప్రసాదం స్వీకరించి, జయప్రదం చేయవలెనని కోరారు.ఈ ఉరుసు సందర్బంగా దర్గాను రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించారని తెలిపారు.

About Author