స్ప్రైపిల్ సీఈఓ డా. బూరా వెంకటేశ్వర్లుకు జీ5 2025 అచీవర్స్ అవార్డ్
1 min read

హైదరాబాద్ , న్యూస్ నేడు : స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ రంగంలో చేసిన విశిష్ట కృషికి గాను స్ప్రైపుల్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు & సీఈఓ డా. బూరా వెంకటేశ్వర్లుకు ప్రతిష్టాత్మకమైన “2025 జీ5 అచీవర్స్ అవార్డ్” ప్రదానం చేశారు.భారత మాజీ రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డు అందించబడింది. ఈ వేడుకలో పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డి శ్రీ కె. తారక రామారావు, శ్రీ ఈటల రాజేందర్, శ్రీ తనికెళ్ల భరణి వంటి గౌరవనీయులు పాల్గొన్నారు.25 ఏళ్లకు పైగా గ్లోబల్ ఐటీ లీడర్‌షిప్ అనుభవం కలిగిన డా. బూరా, జ్యూరిచ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎరిక్సన్ వంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో అతి పెద్ద టెక్నాలజీ సొల్యూషన్లు విజయవంతంగా అందించారు.ఈ ప్రయాణంలో ముందంజలో ఉన్నది స్ప్రైపిల్ హెచ్ఆర్ఎంఎస్ కోసం రూపకల్పన చేసిన ఆధునిక హెచ్ఆర్ & పేరోల్ సొల్యూషన్. రెస్టారెంట్లు & ఫుడ్ సర్వీసులు, విద్యాసంస్థలు, హెల్త్‌కేర్ & హాస్పిటల్స్, ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు, కార్పొరేట్ సంస్థలు వంటి విభిన్న రంగాలలో ఈ ప్లాట్‌ఫాం విజయవంతంగా ఉపయోగపడుతోంది.“ఈ అవార్డు నా వ్యక్తిగత ప్రయాణానికి మాత్రమే కాదు, భవిష్యత్తు వర్క్ కల్చర్‌ను అత్యాధునికమైన టెక్నాలజీ ద్వారా మలచాలనే స్ప్రైపిల్ లక్ష్యానికి గుర్తింపు” అని డా. బూరా వెంకటేశ్వర్లు అన్నారు. ఈ విజయంతో, స్ప్రైపిల్ తన ఇన్నోవేషన్, లీడర్‌షిప్, గ్లోబల్ ఇంపాక్ట్ ద్వారా వర్క్‌ప్లేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా మరింత బలంగా ముందుకు సాగుతోంది.

