NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కైరుప్పలలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి

1 min read

గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం – ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం

ఆలూరు న్యూస్ నేడు: ఆస్పరి మండలంలోని కైరుప్పల గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన వైకుంఠం జ్యోతి, ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు.గ్రామ ప్రజలతో మమేకమైన ఆమె స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *