NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాధవరంలో టీడీపీ విజయభేరి!

1 min read

జనసేన అభ్యర్థిపై 164 ఓట్ల మెజారిటీతో సీమ రామ సుబ్బారెడ్డి గెలుపు

ప్యాపిలి న్యూస్ నేడు:ప్యాపిలి మండలం మాధవరం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి సీమ రామ సుబ్బారెడ్డి, జనసేన అభ్యర్థి రామ్మోహన్‌పై 164 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.విజయం అనంతరం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా డిక్లరేషన్-ఫారం అందుకుని సంతోషం వ్యక్తం చేశారు.ఈ విజయంతో మాధవరం గ్రామంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సీమ రామ సుబ్బారెడ్డికి అభినందనలు తెలిపారు. తన విజయానికి సహకరించి, మద్దతుగా నిలిచిన ఓటర్లందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *