NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు శాఖ అధికారులు.. సిబ్బందికి హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు

1 min read

ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు జిల్లా ప్రజలకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు,పోలీసు శాఖలోని అధికారులు మరియు సిబ్బందికి హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో నూతన ఆశలు, సానుకూల ఆలోచనలు, ఐకమత్య భావనను పెంపొందించాలని కోరుకున్నారు.జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని,బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు తావులేకుండా సురక్షితంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, చిన్నపిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు నిరంతరం సమాచారం అందిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ దీపావళి పండుగ ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి మరియు శాంతిసామరస్యాలను అందించాలని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *