ఉపాధి హామీ చట్టాన్ని నిర్వర్యం చేయడానికి కేంద్రం కుట్ర
1 min read

సిఐటియు మండల కార్యదర్శి ఎస్ ఎ.చిన్న రహిమాన్
ప్యాపిలి న్యూస్ నేడు: గ్రామీణ వలసలను నివారించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో 2005లో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకే కేంద్రం కొత్త బిల్లు తీసుకొచ్చి జాతిపిత మహాత్మాగాంధీ ని అవమానించిన గాడ్సే వారసులకు తగిన గుణపాఠం తప్పదని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహిమాన్ మండల అధ్యక్షులు పి. రామాంజనేయులు, ఇలియాజ్ హెచ్చరించారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారవుతుందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని ‘హామీ’ అనే పదాన్ని తొలగించడం ద్వారా ఈ చట్టం నిర్వీర్యం అవుతుందన్నారు.పని పొందడాన్ని హక్కుగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించడం పేదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన క్రూర దాడి.నిధుల కోసం రాష్ట్రాలను మరింతగా కేంద్రంపై ఆధారపడేలా చేస్తుంది. తద్వారా, పేదలకు పెనుభారంగా మారుతున్న ఉదారవాద ఆర్థిక సంస్కరణల ఎజెండాను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం దొరుకుతుంది.వామపక్షాల మద్దతుతో దేశాన్ని పాలించిన తొలి యుపిఎ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించింది. ఈకార్యక్రమంలో నాగేంద్ర, రవి ,జాఫర్, ఖాదర్, హనుమంతు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

