NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్త్రీ-శక్తి పథకం సమస్యలు వెంటనే పరిష్కరించాలి..!

1 min read

స్త్రీ-శక్తి పథకం సమస్యలు పరిష్కరించకపోతే కండక్టర్లు/డ్రైవర్లు డ్యూటీలు చేయడం కష్టం..!!

ఆర్టీసి ఇ.యు రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు

 విజయవాడ , న్యూస్​ నేడు : రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రవేశపెట్టిన స్త్రీ-శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బందిఅంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, ఈ పథకం కారణంగా కండక్టర్లు, డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులుపైన గాని,పెరిగిన తీవ్రమైన పని ఒత్తిడి ని గాని పట్టించు కోవడంలేదు సరి కదా ఆర్టీసి తణీకి అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ విధినిర్వాహణలో జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లును కూడా క్షమించ కుండా కండక్టర్లపై కేసులు రాస్తుంటే డిపోమేనేజర్లు నిజానిజాలను పరిశీలించకుండా వాటిని ఆదారంగా తీసుకొని సస్పెండ్లు చేయడం,తీవ్రమైన పనిష్ మెంట్లు ఇస్తున్నారని ఇలా అయితే భవిష్యత్ లో కండక్టర్లు,డ్రైవర్లు డ్యూటీలు చేయడమే కష్టం అవుతుందని  ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు అన్నారు.శనివారం ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏన్టీఆర్ జిల్లా విధ్యాదరపురం డిపో యూనియన్ నిర్మాణమహా సభ జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల్లోని 15 డివిజన్లలో న్యాయపరమైన చిక్కుల కారణంగా నిలిచిపోయిన పదోన్నతుల సమస్యను వెంటనే పరిష్కరించి అర్హులైన ట్రాఫిక్ & మెంటినెన్సు ఉద్యోగులకు మరియు ఇతర కేటగిరులఉద్యోగులందరికీ పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారుఈసమావేశంలో పాల్గొన్న ఇ.యు రాష్ట్ర ఉపప్రధానకార్యదర్శి యం.డి.ప్రసాధ్ మాట్లాడుతూ  స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పెరిగిన పని భారం తగ్గించాలంటే ప్రస్తుతం కనీసం 3,000 అదనపు బస్సులు పెంచి,అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీల్లో కనీసం 10,000 పోస్టుల భర్తీ అత్యవసరమని డిమాండ్ చేసారు. కొత్త బస్సులు, కొత్త నియామకాలు లేకుండా ఇదే సిబ్బంది,బస్సులతో స్త్రీశక్తి పథకం నడపడం ఎన్నాళ్లు సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో పాల్గొన్న  విజయవాడ జోన్–2 జోనల్ కార్యదర్శి వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ విధ్యాదరపురం డిపో కమిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ ఎంపిక అయిన కమిటీని ప్రకటించారు.డిపో నూతన కార్యవర్గం ఎన్నిక విధ్యదరపురం డిపో ఇ.యు అధ్యక్షులుగా కొత్తపల్లి అనీల్ కుమార్,డిపో కార్యదర్శిగా యల్.యల్.రాజు తో పాటు మరో 25 సభ్యులను వివిధ హోదాల్లో నియమిస్తున్నట్లు జోనల్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు,యన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి.యం.రావు ప్రకటించారుఈ సమావేశంలో యన్టీఆర్ జిల్లాలో ఉన్న జోన్,జిల్లా కమిటి సభ్యులు అధిక సంఖ్యలో విధ్యాదరపురం డిపో ఉద్యోగులు పాల్గోన్నారు.

About Author