NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎయిడ్స్ పై వివక్ష వద్దు – అవగాహన ముద్దు   

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా ఎయిడ్స్ నివారణ & నియంత్రణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “వారసత్వాన్ని వెలిగిద్దాం” – ఎయిడ్స్ పై వివక్ష వద్దు – అవగాహన ముద్దు ” అనే నినాదంతో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ ర్యాలీని జిల్లావైద్య ఆరోగ్య శాఖా కార్యాలయము నుండి కర్నూలు వైద్య కళాశాల వరకు నిర్వహించి మానవహారము ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. కామేశ్వరప్రసాద్ అధ్యక్షతన ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్బంగా డాక్టర్.  కామేశ్వరప్రసాద్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారికి మనోధైర్యాన్ని ఇస్తూ భావితరాలకు కళంకం లేని సమాజాన్ని వారసత్వంగా ఇవ్వడం ర్యాలీ ముఖ్య ఉద్దేశమని, సకాలములో హెచ్. ఐ. వి   పరిక్షలు , వైరల్ లోడ్ రక్తపరీక్షలు, హెచ్.ఐ. వి ఉన్న వారు క్రమం తప్పకుండ ఏ.ఆర్.టి మందులు వాడాలని, అప్పుడే హెచ్.ఐ.వి మరణాలను తగ్గించగలమని తెలియజేసారు.జిల్లా లెప్రసి ఎయిడ్స్ & టి. బి అధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ మాట్లాడుతూ మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమము అమలు చేస్తున్నామని అందులో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూత్రాన్ని అమలుచేసి క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రామాలు, యువతలో సురక్షిత లైంగిక ప్రవర్తన, కండోమ్ వాడకం పై అవగాహన కల్పించడం, జిల్లా కలెక్టర్  సూచనలు మరియు సహకారముతో 95.95.99 సూత్రాన్ని అమలుచేసి ఎయిడ్స్ రహిత జిల్లా కోసం అడుగులు వేస్తున్నామని తెలియజేసారూ. ఈ కార్యక్రముములో వైద్య ఆరోగ్య శాఖ  వైద్యాధికారులు, జిల్లా గణాంక అధికారి హేమసుందర్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ అలీ హైదర్, దేవి శంకర్ గౌడ,  ఏ ఆర్ టి వైద్యులు, ఐ.సి.టి.సి. ఏ.ఆర్.టి సిబ్బంది, జిల్లా పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి , స్వచ్చంద సంస్థ ప్రతినిధులు , ఎయిడ్స్ నివారణ కార్యక్రమ సిబ్బంది , ఏ పి సాక్స్ పార్టనర్స్ సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *