కూటమి ప్రభుత్వం కొల్లేరు గ్రామ ప్రజలకు అన్ని విదాల అండగా నిలుస్తుంది
1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
నూతనంగా ఎన్నికైన గుడివాక లంక బంటా పెద్దలు
అభినందించిన ఎమ్మెల్యే
నాగశ్విని పేరంటాల తల్లి 5వ వార్షికోత్సవ గోడపత్రికలు ఆవిష్కరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు :ప్రతి కొల్లేరు గ్రామానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని,కొల్లేరు గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.పెదవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు రూరల్ మండలం గుడివాక లంక గ్రామ పెద్దలు, బంట పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన గుడివాక లంక బంట పెద్దలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు.దెందులూరు మండలం గాలాయి గూడెం గ్రామంలో ఏప్రిల్ 7, 2026వ తేదీ నుంచి 9వ తేది వరకు జరగనున్న నాగశ్విని పేరంటాల తల్లి 5వ వార్షికోత్సవాల సందర్భంగా ఉత్సవాల గోడ పత్రికను మంగళవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి ఏటా నాగాస్విని పేరంటాలు తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చర్యలు చేపట్టాలని, ఉత్సవాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను పుష్పగుచ్చాలను అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


