NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లార్తి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

1 min read

సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ప్రజలకు సేవ

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ రఫీక్ సేవలు ప్రశంసనీయం

అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు –వైయస్సార్ కాంగ్రెస్ నేత హామీ

హోళగుంద న్యూస్ నేడు; ఎల్లార్తి గ్రామ సచివాలయం నందు సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్  ఆధ్వర్యంలో డాక్టర్ రఫీక్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా కంటి చూపు తక్కువగా ఉన్న వారిని గుర్తించి, వారికి ఉచితంగా ఆపరేషన్లు చేసి తిరిగి వారి ఇళ్లకు పంపించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను మరింతగా ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన వారికి నర్సింగ్ క్యాంపులు కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది విజయలక్ష్మి, వీరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

About Author