NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుదూర ప్రాంతాల నుండి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ని దర్శించుకున్న భక్తులు

1 min read

సుమారు1518 మంది భక్తులు కి నిత్య అన్నదాన సత్రంలో అన్న ప్రసాద వితరణ

వవిధ సేవల రూపేణ రూ:2,88,934/-లు ఆదాయం సమకూరినది

సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం3-00 వరకూ విచ్చేసిన సుమారు 1815 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.4-30 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.2,88,934/-లు ఆదాయము వచ్చినదని. దానిలో భాగంగా  రాజమండ్రి వాస్తవ్యులు మేకా పాపారావు,ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు రూ:1,00,000/-లు అన్నదానానికి విరాళంగా అందజేసినట్లు, శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు  ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన తెల్పినారు.

About Author