జిల్లా లో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా లో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంఓయూలు అయిన మరియు అనుమతి పొందినప్రాజెక్టులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, భూసేకరణ, అవసరమైన అనుమతులు, అలాగే ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 38 పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూ లు అయ్యాయని, వీటిలో ఇంకా మొదలు పెట్టని పరిశ్రమలను త్వరితగతిన మొదలు పెట్టాలని, అలాగే మొదలు పెట్టిన పరిశ్రమలను వేగంగా పూర్తి చేయాలని, పూర్తి అయిన పరిశ్రమలను త్వరితగతిన ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని పరిశ్రమలను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్,జోనల్ మేనేజర్ మధు సూదన్ రెడ్డి వీరేంద్ర పాల్గొ న్నారు.

