మహిళల భద్రతే లక్ష్యం ….
1 min read

మహిళల పై జరిగే నేరాలు, నూతన చట్టాల పై అవగాహన .
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆయా పోలీసుస్టేషన్ ల పరిధులలోని గ్రామాలను సందర్శించారు. మహిళల భద్రత , రక్షణ కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్ధినులకు సైబర్ నేరాలు, శక్తి యాప్, నూతన చట్టాల పై అవగాహన కల్పించారు.ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వారి భద్రత కోసం డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లుకు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని వివరించారు.పోలీస్ సేవల గురించి వివరించారు. వాటికి ఏ విధంగా స్పందించాలో తెలియజేశారు.

