డా. శ్రీరామ్ భట్‌తో మెడికవర్ వైద్యుల సమావేశం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో నిర్వహించిన వైద్య సదస్సు సందర్భంగా ప్రముఖ జనరల్ సర్జన్, మాజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ – జనరల్ సర్జరీ, Manipal University కు చెందిన Dr Sriram Bhat M పాల్గొన్నారు.శస్త్రచికిత్స రంగంలో విశేష అనుభవం కలిగిన డా. శ్రీరామ్ భట్ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన SRB’s Manual of Surgery మరియు SRB’s Clinical Methods గ్రంథాల రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మొత్తం ఏడు ప్రసిద్ధ వైద్య గ్రంథాలను రచించిన ఆయన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు మరియు వైద్య విద్యార్థులు అధ్యయనం చేసే ముఖ్య గ్రంథాలుగా నిలిచాయి. సులభమైన శైలి, ప్రాయోగిక వివరణలతో ఆయన రచనలు వైద్య విద్యలో అమూల్యమైన మార్గదర్శకాలుగా గుర్తింపు పొందాయి.ఈ సందర్భంగా Medicover Hospitals Kurnool కు చెందిన న్యూరో సర్జన్ Dr Vishwa Kumar మరియు జనరల్ సర్జన్ Dr Bhargav Vyas తమ గురువైన డా. శ్రీరామ్ భట్ ని మెడికవర్ హాస్పిటల్, కర్నూలులో కలుసుకొని సత్కరించారు. తమ వైద్య జీవితంలో గురువు అందించిన మార్గదర్శకత్వం, శిక్షణ తమ వృత్తి ప్రగతికి ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు యూనిట్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,“డా. శ్రీరామ్ భట్ వంటి ప్రముఖ మరియు అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వం యువ వైద్యులకు అమూల్యమైనది. ఇలాంటి మహనీయుల జ్ఞానం, బోధనలు వైద్య సేవల ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయి. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ఎప్పటికప్పుడు వైద్యుల అకడమిక్ అభివృద్ధికి, అత్యాధునిక వైద్య సేవల అందింపుకు కట్టుబడి ఉంది” అని తెలిపారు.ఈ సమావేశం వైద్య రంగంలో జ్ఞానం, అనుభవాల పంచుకునే వేదికగా నిలిచి, గురు-శిష్యుల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని ప్రతిబింబించిన ప్రత్యేక కార్యక్రమంగా నిలిచింది.

