రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం
1 min read
ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలి
ఈ రోజు స్వీకరించిన అర్జీలు 164
రెండవ విడత “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వరాణ
జిల్లా కలెక్టరుతో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
ప్రతినిధి,న్యూస్ నేడు: ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల ప్రజాపరిషత్తు కార్యాలయ సమావేశమందిరంలో శుక్రవారం నిడమర్రు గ్రామానికి సంబంధించిన రెండవ విడత “ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని, సంయుక్తంగా ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాల్లో దశలువారీగా రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించుటకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టామని అన్నారు. గ్రామ ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారంపై అధికార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులు ప్రతి గడపకు చేరేలా అధికారులు కృషిచెయ్యాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఒక్కసారి వచ్చిన అర్జీని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఒకసారి వచ్చిన అర్జీ సక్రమంగా పరిష్కారం కాకుండా మరలా వచ్చినట్లయితే ఆయా అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రెండవ విడత “వన్ మంత్ – వన్ విలేజీ – ఫోర్ విజిట్స్” కార్యక్రమం గ్రామసభలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొనుట మాకు ఎంతో సంతోషం కలిగిందని, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. గ్రామ ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపినట్లయితే గ్రామ ప్రజలు సమస్యలు తగ్గుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.గ్రామాలు సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇందుకు అధికార్లు మంచి సహకారం అందించాలని కోరారు.నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామనివాసి బరే కుటుంబరావు, వై.వెంకటస్వామిలు పెరిగిన జనాభాకు ఉన్న ఓహెచ్ఆర్ ట్యాంకు సరిపోవటం లేదని అది శిధిలావస్థకు చేరిందని, రెండవ ఓహెచ్ఆర్ ట్యాంకు మంజూరు చెయ్యాలని కోరారు, నిడమర్రు మండలం బువ్యనపల్లి గ్రామ నివాసి తన్నీడి విజయకుమార్ యుపి ప్రాథమిక పాఠశాల ప్రాంతాల్లో సీసీ రోడ్డులు, డ్రైనేజీ నిర్మాణాలు చెయ్యాలని కోరారు, నిడమర్రు మండలం పెదనిడ్రకోలను గ్రామనివాసి సి.హెచ్.వెంకటేశ్వర రావు శివాలయం చెరువుకు రక్షణ కొరకు గోడనిర్మాణం చేపట్టాలని కోరారు, నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామనివాసి వాకమూడి ఇంద్రకుమార్ మా స్వర్ణగ్రామ సచివాలయంలో వెల్ఫేరు అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంటు రెండు పోస్టులు భర్తీచెయ్యాలని, వాటరు కొరకు క్రొత్త పైపులైను మంజూరు చెయ్యాలని కోరారు, నిడమర్రు మండలం అడవికొలను గోలి పుండరీకాక్షుడు తాడేపల్లిగూడెం నుండి అడవికొలనుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుసౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోరు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, యంపిపి ధనికొండ ఆదిలక్ష్మి, జిల్లా, నియోజక వర్గం, మండల వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

