రాత్రివేళల్లో కొనసాగుతున్న విజిబుల్ పోలీసింగ్
1 min read
రోడ్డు ప్రమాదాల నివారణకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాలు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు.రాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.జాతీయ రహదారులపై లారీలు, బస్సులు మరియు ఇతర వాహనాలను ఆపి డ్రైవర్లకు విశ్రాంతి కల్పిస్తూ, నీటితో ముఖం కడిగించి అప్రమత్తం చేస్తున్నారు.అలసటతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అతి వేగం, రాంగ్ రూట్, అధిక ప్రయాణికులతో వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

