కాటికాపరుల సమస్యలు పరిష్కరించాలి..
1 min read

కెవీపీఎస్ లింగస్వామి డిమాండ్..
మిడుతూరు, న్యూస్ నేడు: స్మశానాలకు గుంతలు తీసే కాటికాపరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కుల వ్యవసాయ పోరాట సమితి మిడుతూరు మండల కార్యదర్శి జి.లింగస్వామి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు.సమావేశం అనంతరం కెవీపిఎస్ లింగస్వామి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. మరణించిన వారిని భూస్థాపితం చేసేందుకు గాను స్మశానాలు తీసే కాటికాపరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. కాటికాపరుల డిమాండ్లు: ప్రభుత్వ వృత్తిగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.వృత్తిదారులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.వారికి అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఇవ్వాలి.ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్పు శేఖర్, జయరాజ్,నాగన్న,మత్తయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

