NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా కార్యక్రమాలకు అందరూ సహకరించాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో బంగారుపేట ప్రైమరీ స్కూలులో 50 మంది విద్యార్థులకు పలకలు, పళ్ళు బిస్కట్ ప్యాకెట్లు ,ప్లేట్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో లయన్స్  క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్  డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, రిటైర్డ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్  జోన్స్ ఉపాధ్యక్షుడు   లయన్ మురారి శంకరప్ప, గౌరవాధ్యక్షులు  భీమా ఎల్లా గౌడ్ ,మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లయన్ తిరుపతి సాయి, రిటైర్డ్ డి.ఎ.స్పి పాపారావు ,రిటైర్డ్ తహసిల్దార్ జయన్న, స్కూల్ హెడ్మాస్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు .అనంతరం విప్రా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ ను కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు.

About Author