మహిళలు,చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మిషన్ శక్తి పథకం వన్ స్టాప్ సెంటర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకొని నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో మహిళలు, బాలల భద్రత అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వన్ స్టాప్ సెంటర్ మేనేజర్ స్వర్ణలత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించి చట్టపరమైన రక్షణ సూచనలు ఇవ్వడం జరుగుతుందని, ఆపదలో ఉన్నప్పుడు మహిళా హెల్ప్ లైన్ 181, చిల్డ్రన్ హెల్ప్ లైన్ 1098 ద్వారా బాధితులు వెంటనే సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ జాగృతి కమిటీ మెంబర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 25వ తేదీన పిల్లల రక్షణ, భద్రత మరియు హక్కుల పరిరక్షణ కోసం మిస్సింగ్ చిల్డ్రన్ డే ని జరుపుకుంటామని, తల్లిదండ్రులు పిల్లలకు అపరిచితుల గురించి మరియు సోషల్ మీడియా వల్ల వచ్చే అపరిచితుల పరిచయాలపై అప్రమత్తతపై అవగాహన కల్పించాలన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు జిల్లా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ ప్రతి చిన్నారి సురక్షితంగా సంతోషంగా జీవించే హక్కును కల్పించే బాధ్యత మన అందరి పైన ఉంటుందన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ కే.డి.జే బాబు మాట్లాడుతూ మోసపూరిత వ్యక్తుల మాటలను నమ్మి ఆపదని కొని తెచ్చుకోరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్ వన్ స్టాప్ సెంటర్ కేస్ వర్కర్ జ్యోత్స్న, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

