NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి ఐక్యతే ఘన విజయం సాధించింది

1 min read

నగర ప్రజల నమ్మకమే మరోసారి కూటమికి పట్టం కట్టేలా చేసిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి

క్యాంపు కార్యాలయంలో మేయర్‌ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే చంటి మీడియా సమావేశం

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే కూటమి ఐక్యతే ఘన విజయం సాధించిందని, నగర ప్రజల నమ్మకమే మరోసారి కూటమికి పట్టం కట్టేలా చేసిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు కార్పొరేషన్‌ మేయర్‌ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సొంతం చేసుకున్న సందర్భంగా పవర్‌ పేటలోని తన క్యాంపు కార్యాలయంలో మేయర్‌ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్‌ చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన ప్రజలందరికీ ఎమ్మెల్యే చంటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ప్రధానంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాన్ని సక్సెస్‌ఫుల్‌గా అన్నిచోట్లా అమలు చేసి విజయాన్ని కూటమి ఖాతాలో వేసినట్లు చెప్పారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసినట్లుగా ఎక్కడా పైరవీలు చేయలేదని, స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయన్నారు. రఫారఫా అంటూ విరుచుపడిన వైసీపీకి ఏలూరు రిజల్ట్స్‌ గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించిన ఆయన,,, 2021 కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి 3డివిజన్‌లే వచ్చాయని, ఇప్పుడు 3 డివిజన్‌లు వైసీపీ మిగిల్చి గత బాకీని చెల్లుచేశామంటూ వెల్లడించారు. మేయర్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రెండున్నరేళ్ళ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఇప్పుడొచ్చిన కార్పొరేషన్‌ ఫలితాలే దర్పణమని వ్యాఖ్యానించారు. తన విజయానికి పూర్తి బాధ్యత తీసుకుని శ్రమించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే గెలిచిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. చైతన్యవంతంగా ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రాష్ట్రంలో పాలన చేయనుందంటూ అప్పలనాయుడు స్పష్టం చేశారు. అదేవిధంగా కార్పొరేటర్ల గౌరవాన్ని మరింత పెంచేలా నగరంలో పాలన ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, జనసేన సీనియర్‌ నాయకులు నారా శేషు, మాజీ కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *