ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు
1 min read
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయం,కైకలూరు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ఆంధ్రప్రదేశ్లో జరుగనున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (యం పి టి సి లు), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్ పి టి సి లు) రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన నవంబర్ 3 తేదీ స్థానంలో
నవంబర్ 5, 2026 (గురువారం) రోజున వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని పరిశ్రమలు, సంస్థలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర యాజమాన్యాల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొంది. [ఎ.గణేషన్]( జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్, జోన్-II, ఏలూరు ఆదేశాల మేరకు విడుదల చేయడమైనదని బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.



