NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్త కనకదాసు విగ్రహం పగలగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలి – ఎమ్మెల్యే

1 min read

ఆలూరు , న్యూస్ నేడు:   ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం మణేకుర్తి గ్రామంలో కొన్ని రోజుల కిందట కురువ ల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు విగ్రహం పగలకొట్టిన వారిని కఠినంగా శిక్షించాలి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి తనవంతుగా 20వేల రూపాయలు శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు నూతన విగ్రహం కూర్చోపెట్టడానికి కురువ పెద్దలకు ఇవ్వడం జరిగింది.ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ….కొన్ని రోజుల మణేకుర్తి గ్రామంలో శ్రీ భక్త కనకదాసు విగ్రహం పగలకొట్టడం చాలా నీచమైన పని అన్నారు.ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అనవసరంగా గొడవలు సృష్టి0చకండి.. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడాలి తప్ప, ఇలా విగ్రహం పగలకొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. నేను కూడా డిఎస్పీ తో ఫోన్లో మాట్లాడుతూ నిందుతుల వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. గ్రామాల్లో ఎవరు కూడా లేనిపోని అపోహాలు నమ్మి గొడవలు చెయ్యదు. నేను కూడా నా లెటర్ తో కలెక్టర్ మేడం గారికి విగ్రహం ఇప్పుడు ఉన్న చోటే పెట్టాలని వినతిపత్రం ఇస్తాను అన్నారు.వైస్సార్సీపీ పార్టీ అధికారం ఉన్నపుడు విగ్రహలు పగలకొట్టడం అనేది ఎక్కడ జరగలేదు అని అన్నారు.విగ్రహం పగలకొట్టిన నిందుతులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి ,వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author