నీట్ పేపర్ లీక్ చేసిన వారిని శిక్షించాలి
1 min read
డీటీకి వినతిపత్రం అందజేసిన పిడిఎస్ యు..
నందికొట్కూరు న్యూస్ నేడు: నీట్ పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పిడిఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి కే ఆది డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో విద్యార్థులతో కలసి మంగళవారం ధర్నా చేపట్టారు.పార్లమెంట్ కు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 200 మంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.డిప్యూటీ తహసిల్దార్ సోమేశ్వరి,ఆర్ఐ భాషకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూనీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన 18 విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్ చుక్ జంతర్ మంతర్‌లో నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ను అరెస్టు చేసి బలవంతంగా హాస్పటల్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతి యుతంగా ఛలో పార్లమెంట్ ముట్టడికి ర్యాలీగా వెళుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నీట్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేంద్ర విద్యా శాఖ మంత్రిగా తొలగించాలని డిమాండ్ చేశారు.అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులపై రౌడీల్లా ప్రవర్తించిన ఢిల్లీ పోలీసులపై కేసు నమోదు చేసి వారిని తమ పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు అంజి,అజయ్,శివాజీ ఆది, శ్రీధర్ రాజు విద్యార్థులు పాల్గొన్నారు.


