NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలి

1 min read

పింఛన్ దరఖాస్తు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

దరఖాస్తుదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా, పారదర్శకంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్ట 1, 2 స్వర్ణ వార్డులను జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా నూతనంగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని స్వయంగా పరిశీలించి, దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఒక్కో దరఖాస్తు ప్రక్రియకు పడుతున్న సమయం, దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, అర్హత ప్రమాణాలు తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ కోసం వచ్చే వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ పథకం ప్రయోజనం అందేలా సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *