ఎంపీటీసీ ఓటర్ల జాబితా పరిశీలన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎంపీటీసీ మ్యాప్, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలను అధికారులు పరిశీలించారు. ఈ జాబితాలను ఈ నెల 11న ప్రచురించేందుకు చేపట్టిన ప్రక్రియను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుధాకర్ రెడ్డి, డోన్ డీడీఓ భాస్కర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా మండల స్థాయి సిబ్బంది, ఎంపీడీఓ శ్రీనివాస రావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభకర్ రెడ్డి, పరిపాలన అధికారి తదితరులకు ఓటర్ల జాబితా పరిశీలన, ప్రచురణకు సంబంధించి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.


